పాట్నా: కాంగ్రెస్‌లో తన జన్ అధికార్ పార్టీ (జేఏపీ)ని విలీనం చేసిన మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్.. పూర్నియా లోక్‌సభ సీటుపై పట్టు వదిలేలా కనిపించడం లేదు. నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టుదలతో ఉన్న ఆయన వైఖరి బిహార్‌లో మహాకూటమిపై ఒత్తిడి తెస్తోంది.
రాష్ట్రీయ జనతాదళ్ ( ఆర్‌జేడీ ) , కాంగ్రెస్, వామపక్షాలతో సహా బిహార్‌లో విపక్షాల కూటమి మహాఘట్‌బంధన్ ఏర్పడింది. ఈ కూటమి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పూర్నియాతో సహా రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో 26 స్థానాలను తమ అతిపెద్ద మిత్రపక్షమైన ఆర్జేడీకి కేటాయిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో, సీపీఐ (ఎంఎల్) 3 స్థానాల్లో, సీపీఐ, సీపీఎం ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి.
ఏప్రిల్ 2న నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైన పప్పు యాదవ్ తాజగా ఏప్రిల్ 4న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. పూర్ణియాకు సంబంధించి తన నిర్ణయాన్ని పునరాలోచించి ఆ సీటును కాంగ్రెస్‌కు ఇవ్వాలని ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌ను పప్పు యాదవ్ కోరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment