పాట్నా: మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్, కాంగ్రెస్‌లో కొనసాగుతున్నప్పటికీ బీహార్‌లోని పూర్నియా స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వేదికపై ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనకు పదేపదే టికెట్ ఎందుకు దక్కడం లేదంటూ బోరున ఏడ్చేశారు.
వేదికపై ఏడుస్తూనే ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్, తేజస్వి యాదవ్‌లపై పప్పూ యాదవ్ విరుచుకుపడ్డారు. పూర్నియాకు ప్రాతినిధ్యం వహించాలనే తన కోరికను వ్యక్తం చేసినప్పటికీ ఆర్జేడీ తమ అభ్యర్థిని బరిలో నిలిపిందన్నారు. తనలో ఏం లోపముందని పూర్ణియాను విడిచిపెట్టి మరో స్థానానికి వెళ్లమంటున్నారని ప్రశ్నించారు.
'నాలో ఏమి లోటు ఉంది? మధేపురా లేదా సుపాల్‌కి వెళ్లమని నాకు మళ్లీ మళ్లీ ఎందుకు చెబుతున్నారు? కాంగ్రెస్‌లో నా పార్టీ విలీనానికి ముందు కూడా లాలూ యాదవ్‌ను కలిశాను. పూర్ణియాను వదిలి ఎక్కడికీ వెళ్లలేనని చెప్పాను' అని యాదవ్ కన్నీళ్లతో చెప్పారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌తో పాటు తనపై నామినేషన్ వేస్తున్న తన ప్రత్యర్థి భీమా భారతిపై కూడా పప్పు యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
चाहे जितना कर लो जुल्मों सितम
— Jan Adhikar Party (Loktantrik) Fan Club (@jap4bihar) April 4, 2024
पूर्णिया का जन जन है तैयार
स्वाभिमान जीतेगा इस बार #पूर्णिया_मांगे_पप्पू_यादव #PappuYadav #प्रणाम_पूर्णिया pic.twitter.com/GBi0lLFGqI
Comments
Please login to add a commentAdd a comment