
సెంట్రల్ వర్సిటీలను నెలకొల్పాలి
అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రీయ విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలని, అవి ఆయా రాష్ట్రాలకు పూర్తి న్యాయం చేసేలా పరిధి విధించాలని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కేంద్రాన్ని కోరారు.
లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్
సాక్షి, న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రీయ విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలని, అవి ఆయా రాష్ట్రాలకు పూర్తి న్యాయం చేసేలా పరిధి విధించాలని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి ప్రవేశపెట్టిన సందర్భంగా సుమన్ మాట్లాడారు. వెనుకబడిన రాష్ట్రమైన బిహార్‌లో సెంట్రల్ వర్సిటీని ఏర్పాటుచేయాలని తీసుకువచ్చిన ఈ సవరణ బిల్లును స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా కేంద్రీయ విశ్వవిద్యాలయం మంజూరు కావాల్సి ఉందని, వాటిని కూడా ఈ బిల్లులో పొందుపరిస్తే బాగుండేదని పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు పలుకుతోందని సుమన్ తెలిపారు.