
సాక్షి,హైదరాబాద్:ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చర్చకు రావొద్దనే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని బీఆర్‌ఎస్ నేత బాల్కసుమన్ అన్నారు. బుధవారం(సెప్టెంబర్18) సుమన్ మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో అవినీతి, కుటుంబ పాలన, దందాలు నడుస్తున్నాయని విమర్శించారు.
‘హైడ్రా పేరుతో భయపెట్టి వసూళ్ల దందా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్.తమ్మడి కుంట ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టిన సిపాయి హిమాయత్ సాగర్‌లో ఉన్న ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూల్చడంలేదు. నాగార్జునను 400 కోట్లు డిమాండ్ చేశారు. ఇవ్వనందుకే కూల్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌజ్‌లను కూల్చరు.
ప్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. ప్రజా పాలన నడుస్తలేదు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెడుతున్నారు. రేవంత్ టీమ్‌లో ఉండి ఫేక్ న్యూస్‌లు పెడుతున్న వారిని, అధికారులను కెసిఆర్, కేటీఆర్ వదిలిపెట్టినా నేను వదిలి పెట్టను’ అని సుమన్ ఫైర్ అయ్యారు.

ఇదీ చదవండి.. బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసును 15 రోజుల్లో కూల్చేయండి: హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment