రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో హెచ్సీయూ మరోసారి వేడెక్కింది.
హైదరాబాద్: రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో హెచ్సీయూ మరోసారి వేడెక్కింది. విద్యార్థి ఆత్మహత్యను రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నాడని ఆరోపిస్తూ.. ఏబీవీపీ విద్యార్థులు రాహుల్ గో బ్యాక్ నినాదాలతో ఆందోళన నిర్వహించారు. యూనివర్సిటీ ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులపై లాఠీలు జులిపించారు. పలువురు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
అంతకు ముందు యూనివర్సిటీలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, వీహెచ్ నిర్వహిస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.