రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణ | ministry of hrd to set a judicial comission on rohith suicide | Sakshi
Sakshi News home page

రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణ

Published Fri, Jan 22 2016 4:39 PM | Last Updated on Fri, Jul 26 2019 5:38 PM

రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణ - Sakshi

రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణ

ఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై కేంద్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. రోహిత్ మృతికి దారి తీసిన పరిస్థితులు, యూనివర్సిటీలోని పరిణామాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ మంత్రి స్మృతీ ఇరానీ శుక్రవారం ప్రకటించారు. ఈ అంశంపై జ్యుడిషియల్ కమటీ విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. కుమారుడిని కోల్పోయిన రోహిత్ తల్లితో ఫోన్ లో మాట్లాడిన స్మృతీ ఇరానీ.. తన సంతాపాన్ని తెలిపారు.

అలాగే విద్యా రంగంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ఓ   కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు మానవ వనరుల శాఖ ప్రకటించింది. దళిత విద్యార్థుల పట్ల వివక్ష మూలంగానే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని విమర్శలు వస్తున్న నేపథ్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement