పెనుగొండ మండలంలోని గొర్రెల పెంపకం క్షేత్రం వద్ద సెంట్రల్ యూనివర్సిటీని నిర్మించడానికి అనువైన భూములను అనంతపురం కలెక్టర్ కోన శశిధర్ గురువారం పరిశీలించారు.
అనంతపురం: పెనుగొండ మండలంలోని గొర్రెల పెంపకం క్షేత్రం వద్ద సెంట్రల్ యూనివర్సిటీని నిర్మించడానికి అనువైన భూములను అనంతపురం కలెక్టర్ కోన శశిధర్ గురువారం పరిశీలించారు. కలెక్టర్‌తో పాటు స్థానిక అధికారులు కూడా భూముల పరిశీలనలో పాల్గొన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసిన విషయం తెలిసిందే.
(పెనుగొండ)