సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు కేంద్రం రాష్ట్రంలో అనంతపురం జిల్లా జంతులూరు గ్రామంలో ఈ కేంద్రీయ విశ్వ విద్యాలయాన్ని స్థాపించనుంది.
‘సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా ఈ వర్సిటీని పిలుస్తారు. నిర్మాణానికి తొలి విడత వ్యయానికి రూ.450 కోట్లు కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం (2018-19) నుంచే తాత్కాలిక ప్రాంగణంలో పని చేయాలన్న ప్రతిపాదనకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ఏపీలో కేంద్రీయ వర్సిటీకి కేబినెట్ ఆమోదం
Published Thu, May 17 2018 4:01 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment