
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావుకు కీలక పదవి లభించింది. ఆయనను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ చాన్స్‌లర్‌గా నియమిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, డీన్‌గా అనేక సంవత్సరాలు ఎస్వీ శేషగిరిరావు సేవలు అందించారు. ఆయనకు బీజేపీతో అనుబంధముంది. బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయన వ్యవహరించారు.