ఆత్మహత్య చేసుకున్న సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధికకు గుంటూరులో ఇల్లు నిర్మించి ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడికి మంగళవారం ఒక లేఖ రాశారు.
- ముఖ్యమంత్రికి ఎంపీ వీహెచ్ లేఖ
న్యూఢిల్లీ
ఆత్మహత్య చేసుకున్న సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధికకు గుంటూరులో ఇల్లు నిర్మించి ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడికి మంగళవారం ఒక లేఖ రాశారు. దళితులపై వివక్ష కారణంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఎంత పరిహారం ఇచ్చినా ఆ మాతృమూర్తికి జరిగిన నష్టాన్ని భర్తీచేయలేమని తెలియజేశారు. అందువల్ల మానవీయ కోణంలో ఆమెకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.