
కృష్ణాజలాల వాటాలో పాలమూరుకు అన్యాయం
సొంత రాష్ట్రంలో కృష్ణానదీ జలాల వాటా కోసం పోరాడాల్సి రావడం దురదృష్టకరమని సెంట్రల్ యూనివర్సిటీ
ఉద్యమ హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం
{పొఫెసర్ హరగోపాల్ ధ్వజం
మహబూబ్‌నగర్ అర్బన్ : సొంత రాష్ట్రంలో కృష్ణానదీ జలాల వాటా కోసం పోరాడాల్సి రావడం దురదృష్టకరమని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళ న వ్యక్తం చేశారు. పాలమూరు అధ్యయన వేదిక అధ్వర్యంలో ఆదివారం స్థానిక టీఎన్‌జీఓ భవన్‌లో కృష్ణానది ‘నీళ్లు.. మహబూబ్‌నగర్ విషాదగాథ’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ప్రధానవక్తగా ప్రసంగించారు.
నీళ్లు, నిధులు, నియామకాలను ప్రధానాంశాలుగా చేసుకుని తెలంగాణ ఉద్యమం చేశామని, కానీ 18 నెలల కాలంలోనే వాటికోసం మళ్లీ ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఉద్యమపార్టీ టీఆర్ ఎస్ కృష్ణాజలాల విషయంలో మహబూబ్‌నగర్ జిల్లాపై వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.