రోహిత్ కుటుంబానికి రూ.8లక్షల ఆర్థిక సాయం | Hyderabad Central university announces Rs 8 lakh ex-gratia to the family of dalit scholar Rohith Vemula | Sakshi
Sakshi News home page

రోహిత్ కుటుంబానికి రూ.8లక్షల ఆర్థిక సాయం

Published Fri, Jan 22 2016 7:40 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

రోహిత్ కుటుంబానికి రూ.8లక్షల ఆర్థిక సాయం - Sakshi

రోహిత్ కుటుంబానికి రూ.8లక్షల ఆర్థిక సాయం

హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ కుటుంబానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శుక్రవారం రూ.8లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా రోహిత్ ఆత్మహత్య, వర్సిటీలోని పరిణామాలు తదితర అంశాలపై న్యాయ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. రోహిత్ మృతికి దారి తీసిన పరిస్థితులు, యూనివర్సిటీలోని పరిణామాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఇవాళ ప్రకటించారు. ఈ అంశంపై జ్యుడిషియల్ కమిటీ విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక సమర్పించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement