
సర్కారు విద్యను ధ్వంసం చేశారు
‘‘మధ్యయుగంలోనూ, స్వాతంత్య్ర పో రాట కాలంలోనూ, ఆ తరువాత కూడా పౌర సమాజమే విద్యను అందించేది.
{పయివేటు, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెరిగింది
చంద్రబాబు వచ్చాక అది పరాకాష్టకు చేరింది
మానవీయ విలువలనూ దెబ్బ తీశారు
శాస్త్రీయ, సమాన విద్యే సరైన మందు
పోరాడి హక్కులను సాధించుకోవాలి
చైతన్యవంతం చేయడానికే దేశవ్యాప్త యాత్ర
‘సాక్షి’తో ప్రొఫెసర్ జి.హరగోపాల్
‘‘మధ్యయుగంలోనూ, స్వాతంత్య్ర పో రాట కాలంలోనూ, ఆ తరువాత కూడా పౌర సమాజమే విద్యను అందించేది. 1984 ప్రాం తంలో విద్య ప్రయివేటీకరణబాట పట్టి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పరాకాష్టకు చే రింది. ప్రయివేటు, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెరిగిపోయి ప్రభుత్వ విద్య పూర్తిగా వి ధ్వంసానికి గురైంది’’ అని కేంద్రీయ విశ్వవి ద్యాలయం ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నా రు. అఖిల భారత విద్యా హక్కుల వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన పోరాట యాత్రలో భాగంగా గురువారం ఆయన కామారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటించింది. -
కామారెడ్డి :విద్య ఏరకంగా ప్రయివేటు, కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లింది, విలువలు ఏ విధంగా దిగజారాయి, ఏం చేస్తే ప్రభుత్వ విద్యకు పూర్వ వైభవం వస్తుందన్న విషయాలను ప్రొఫెసర్ హరగోపాల్ ‘సాక్షి’కి ఇలా వివరించారు.
మొదట ఇంటర్ విద్యను దెబ్బతీశారు
మన రాష్ట్రంలో ఎంసెట్‌ను ప్రవేశపెట్టి కార్పొరేట్ శక్తుల చేతులలోకి ఇంటర విద్యను తీసుకెళ్లారు. బడా విద్యాసంస్థలు ప్రవేశించి ఎంసెట్ ప్రత్యేక తరగతుల పేరుతో విద్యను వ్యాపారం చేశాయి. విద్యకు బదులు కోచింగుకు ప్రాధాన్యతనిచ్చాయి. కోట్లాది రూపాయలు ఆ సంస్థలు మూటగట్టుకుని, ఆ మూటలతో ఇప్పుడు కొందరు మ ంత్రులయ్యారు. డబ్బులు పెట్టి చదివిన పిల్లల దృష్టంతా ఇంజనీరింగు చదవాలని, తద్వారా డబ్బు సంపాదించాలనే ధోరణి పెంచారు. ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో 374 ఇంజనీరింగు కళాశాలలుంటే అందులో కేవలం నాలుగు కళాశాలలు మాత్రమే ప్రభుత్వానివి. 370 కాలేజీలు ప్రయివేటు యాజమాన్యాలకు చెందినవే. వాటికి ఫీజు రీయింబర్స్‌మెంటు కింద యేడాదికి రూ. మూడు వేల కోట్లు కట్టబెడుతున్నారు. ఆ డబ్బుతో ప్రభుత్వమే ఎన్నో కాలేజీలు స్థాపించొచ్చు. ఎందరికో ఉచితంగా విద్యనం దించవచ్చు. ఎంతోమందికి ఉద్యోగాలు చూపవచ్చు. ఇవన్ని మరిచిపోయి ప్రయివేటు, కార్పొరేట్ కళాశాలలకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు.
యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారు
ఒకప్పుడు యూనివర్సిటీలకు పెద్ద ఎత్తున ప్రభుత్వాలు నిధులు ఇచ్చేవి. ప్రపంచంలోనే గొప్పదైన ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా పనిచేసిన డీఎస్‌రెడ్డికి, అప్పటి సీఎం బ్రహ్మానందరెడ్డికి విభేదాలతో వీసీని మార్చితే విశ్వవిద్యాలయం భగ్గుమన్నది. అప్పటి సీఎంలు కూడా వీసీలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. తరువాత అదే ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా దెబ్బతీశారు. ఖాళీలను భర్తీ చేయకుండా, కావలసినన్ని నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు. ఓయూలో 80 నుంచి 90 డిపార్టుమెంటులలో లక్ష మంది పిల్లలు చదువుతున్నారు. ఫ్యాకల్టీ ఒక్కో దానికి నలుగురే ఉన్నారు. అందులో ఇద్దరు కాంట్రాక్టువారే. ఇక్కడ అన్ని కలిపితే రూ. 170 కోట్లు మాత్రమే వచ్చాయి. అదే మా సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్క సబ్జెక్టుకే 20 మంది అద్యాపకులున్నారు. రూ. ఆరు వందల కోట్ల బడ్జెట్ కేటాయించారు.
సింగపూర్ ఆదర్శమైతే అక్కడి విద్య విధానాన్ని చూడాలి
ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రులు మాటిమాటికీ సింగపూర్‌లా చేస్తామంటున్నారు. అక్కడి రోడ్లు, బంగ్లాలను చూసి ఇక్కడా నిర్మిస్తామంటున్నారు. అవే కాదు అక్క డి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యావిధానాన్ని కూడా చూసి అమలు చేస్తే బాగుంటుంది. సింగపూర్‌లో ప్రభుత్వరంగ విద్యనే అమలులో ఉంది. ప్రపంచంలో పేరున్న స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీలకు అక్కడి ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేయడమే కాదు వేలాది మంది ప్రొఫెసర్లతో పాఠాలు చెప్పిస్తుంది. జర్మనీలోనైతే విద్య పూ ర్తిగా ఉచితం. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు. మన దేశంలో పేరున్న బాంబే యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, డిల్లీ యూనివర్సిటీలకు మన ప్రభుత్వాలు నిధులను తగ్గించడంతో అవి దెబ్బతినిపోయాయి. ప్రపంచబ్యాంకు చెప్పింది చెవికెక్కించుకోవడమే తప్ప మేధావులు, ప్రజా సంఘాలు చెప్పింది వినే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు.
మానవీయ విలువలను దెబ్బతీశారు
విశ్వ విద్యాలయాలు మేధోసంపత్తిని తయారు చేసేవి. విద్య ప్రయివేటీకరణతో విద్యార్థులు డబ్బులు పెట్టి చదువుతూ డబ్బు కోసం వెంపర్లాడే పరిస్థితులు తీసుకువచ్చారు. లక్షలు పెట్టి సివిల్స్‌కు ప్రిపేర్ అవడం, లక్షలు పెట్టి ఇంజనీరింగు, మెడిసిన్ చదవవడంతో వారు మానవీయతను మరిచిపోతున్నారు. ఉద్యోగంలో చేరాక డబ్బు సంపాదించాలన్న ధ్యాస పెరిగి మానవ సంబంధాలు, మానవత్వం అనేవి మరిచిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విద్యా వ్యాపారంగా మారడం వల్లే ఈ పరి స్థితి వచ్చింది. రాజ్యాంగంలో పొందుపర్చిన విదంగా విద్య అనేది ప్రభుత్వమే అందించాలి. అది కూడా శాస్త్రీయమైన విద్యా విధానం, అందరికీ సమానమైనది అయినపుడే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంది.
ప్రపంచబ్యాంకు దుర్మార్గంతోనే
ప్రభుత్వ విద్య దెబ్బతినడానికి ప్రపంచ బ్యాంకు దుర్మార్గమైన విధానాలు, వాటిని అమలు చేసిన పాలకవర్గాలే కారణం. ఉన్నత విద్యను నాన్ మెరిట్ గూడ్స్‌గా పే ర్కొంటూ ఉన్నత చదువులు చదువుకున్నవారితో సమాజానికి నష్టమనే సూత్రాన్ని ప్రపంచబ్యాంక్ రూపొందించి ఉన్నత విద్యకు పెట్టే ఖర్చును తగ్గించమని సలహా ఇ చ్చింది. దాన్ని పాలకులు అమలు చేయడంతోనే ఈ రోజు యూనివర్సిటీలు దెబ్బతిన్నాయి. 80 శాతం ఉన్నత విద్య ఇప్పుడు ప్రయివేటు, కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లింది. పోరాడి తె చ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటి ప్రభుత్వం ప్రయివేటు ఇంజనీరింగు కాలేజీలకు ఫీ రీయింబర్స్ మెంటు కింద రూ. 300 కోట్లు విడుదల చేసిం ది. శాతవాహన యూనివర్సిటీకి రూ. 12 కోట్లు, తెలంగాణ యూనివర్సిటీకి రూ. 10 కోట్లు, పాలమూరు యూనివర్సిటీకి రూ. 10 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులు పుకుంది. ప్రయివేటు ఇంజనీరింగు కళాశాలలకు ఏటా ఇస్తున్న సొమ్ముతో ఎన్నో కాలేజీలు పెట్టొచ్చు. అలాంటి ఆలోచనలు చేయకుండా ప్రయివేటును ప్రోత్సహిస్తున్నారు. ఇది ప్రమాదకరం.
పోరాడి సాధించుకోవలసిందే
విధ్వంసానికి గురైన విద్యకు పూర్వవైభవం తీసుకురావడానికి అందరూ పోరాడాల్సిన అవసరం ఉంది. విద్యను రక్షించుకునేందుకు, విశ్వ విద్యాలయాలను కాపాడుకునేందుకుగాను దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే వారందరూ కలిసి నవంబర్ రెండున దేశంలోని ఐదు ప్రాంతాలు జమ్ము, కన్యాకుమారి, గోవా, భువనేశ్వర్, మణి పూ ర్ నుంచి దేశవ్యాప్త పోరాటయాత్రలు ప్రారంభించారు. 18 రాష్ట్రాల మీదుగాఈ యాత్ర కొనసాగుతూ డిసెంబర్ 4న భోపాల్‌కు చేరుకుంటాయి. ఆ రోజు అక్కడ జరి గే బహిరంగ సభలో డిక్లరేషన్ ప్రకటిస్తారు. పోరాటం ద్వారానే సాధించుకోవచ్చనే లక్ష్యంతో చేపట్టిన ఈ యాత్రలకు దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రజలు, ప్రజాసంఘా లు, మేదావుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. పోరాడి హక్కులను సాధించుకోవడంలో చివరకు ప్రజలే విజయం సాధిస్తారు.