
సవాళ్లు ఉంటాయ్... ఎదుర్కొంటాం
ఆర్థిక రంగంలో సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.
కాంగ్రా (హిమాచల్ ప్రదేశ్): ఆర్థిక రంగంలో సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా కూడా భారత్‌కు ఉందని ఆయన వివరించారు. షాపూర్‌లో హిమాచల్‌ప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రణబ్, ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏకీకరణ దిశగా అడుగులు వేస్తోందన్నారు.
ఇలాంటి సమయంలో దేశాలకు సవాళ్లు తప్పవని విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆయన 2008 ఆర్థిక సంక్షోభం అటు తర్వాత వచ్చిన యూరో సవాళ్లను ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇలాంటి సవాళ్లు రావని సైతం ఎవ్వరూ చెప్పలేరని పేర్కొన్నారు. అయితే ఆయా సవాళ్లను భారత్ ఎదుర్కొనగలదన్నారు.