కొత్తూరు: మండలంలోని మామిడిపల్లిలో ఉన్న సింబాయాసిస్ అంతర్జాతీయ యూనివర్సిటీలో శనివారం మూట్‌కోర్టు పోటీలు నిర్వహించినట్లు కళాశాల నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ యతిరాజులు, ప్రస్తుత ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
‘సింబాయాసిస్’లో మూట్‌కోర్టు పోటీలు
Published Sat, Sep 24 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
కొత్తూరు: మండలంలోని మామిడిపల్లిలో ఉన్న సింబాయాసిస్ అంతర్జాతీయ యూనివర్సిటీలో శనివారం మూట్‌కోర్టు పోటీలు నిర్వహించినట్లు కళాశాల నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ యతిరాజులు, ప్రస్తుత ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. మూట్‌కోర్టు పోటీలు న్యాయవాద విద్యార్థులకు నైపుణ్యం పెంచుకునేందుకు ఉపయోగపడతాయని వివరించారు. ఈ రోజుల్లో న్యాయవాద విద్యార్థులు డబ్బు సంపాదన కోసం వివిధ రంగాలను ఎంచుకుంటున్నట్లు తెలిపారు. లా చదివిన విద్యార్థులు న్యాయవాద వత్తిని చేపట్టి సమాజశ్రేయస్సుకు పాటుపడాలని కోరారు.
అనంతరం పలువురు విద్యార్థులు చరణ్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు ఉరిశిక్షకు సంబంధించిన లాహోర్‌కుట్ర కేసు లఘునాటికను ప్రదర్శించారు. ఈనెల 23న ప్రారంభమైన పోటీలు 25వ తేదీ వరకు కొనసాగుతాయని వివరించారు. కార్యక్రమంలో సింబాయాసిస్ న్యాయ కళాశాల మూట్‌కోర్టు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ అభిజిత్ వస్మత్కర్, కళాశాల డైరెక్టర్ భేగ్, డిప్యూటీ డైరెక్టర్ సుఖ్వీందర్‌సింగ్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు
Advertisement
Advertisement