ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎస్ అడెల్(పీసీ నం1486) శుక్రవారం సాయంత్రం గాలిలోకి కాల్పులు జరిపిన సంఘటన కలకలం రేపింది.
మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎస్ అడెల్(పీసీ నం1486) శుక్రవారం సాయంత్రం గాలిలోకి కాల్పులు జరిపిన సంఘటన కలకలం రేపింది. 13వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అడెల్ సెలవు కావాలని అధికారులను కోరగా అధికారులు మంజూరు చేయలేదు. దీంతో అతడు మానసిక వేదనకు గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం అడెల్ ఒక్కసారిగా సర్వీసు తుపాకీతో గాలిలోకి సుమారు 20 రౌండ్ల కాల్పులు జరిపాడు. కాగా, అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.