వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట
సాక్షి, హన్మకొండ : వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట ఈనెల 15 నుంచి మార్చి 7 వరకు వ్యక్తిగత కారణాలతో సెలవులో వెళ్తున్నారు. ఈ మేరకు 21 రోజులు సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17న కలెక్టర్ అమ్రపాలి కాటకు 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్‌శర్మతో వివాహం నిశ్చమైన నేపథ్యంలో సెలవులో వెళ్లనున్నారు. 21 రోజుల సెలవు కాలంలో.. ఈ నెల 16 నుంచి 21 వరకు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర సందర్శన, 22 నుంచి 25 వరకు హైదరాబాద్, వరంగల్‌లలో, 26 నుంచి మార్చి 7 వరకు టర్కీ దేశాన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ నెల 18న జమ్ముకశ్మీర్‌లో సమీర్‌శర్మతో ఆమ్రపాలి వివాహం ఘనంగా జరగనుంది. అనంతరం 22న వరంగల్, 25 న హైదరాబాద్‌లో ఆమ్రపాలి తన సన్నిహితులకు విందు ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత 26 నుంచి మార్చి 7 వరకు భర్త సమీర్‌తో కలిసి ఆమ్రపాలి టర్కీ పర్యటన వెళ్లనున్నట్టు సమాచారం.
జేసీలకు ఇన్‌చార్జి బాధ్యతలు
ఇలా ఉండగా ప్రస్తుతం అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి రూరల్ జిల్లాకు ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా ఉన్నారు. ఆమె సెలవులో వెళ్తుండడంతో అర్బన్ కలెక్టర్‌గా జేసీ ఎస్.దయానంద్, రూరల్ కలెక్టర్‌గా జేసీ హరితకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. సెలవుల అనంతరం కలెక్టర్ అమ్రపాలి అర్బన్ కలెక్టర్‌గా, రూరల్ ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment