India Asks Nationals In Niger To Leave Country - Sakshi
Sakshi News home page

భారతీయులు నైగర్‌ను వీడాలని కేంద్రం ఆదేశం..

Aug 11 2023 9:01 PM | Updated on Aug 12 2023 4:35 AM

India Asks Nationals In Niger To Leave Country - Sakshi

తిరుగుబాటుతో నైగర్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్న భారతీయులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. నైగర్‌లో నెలకొన్న పరిస్థితులను కేంద్రం జాగ్రత్తగా గమనిస్తోందని విదేశాంక శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. 

ప్రస్తుతం ఆ దేశం నుంచి ఎయిర్‌లైన్స్ వ్యవస్థను నిలిపివేసినట్లు అరిందమ్ బాగ్చి తెలిపారు. భూభాగం గుండా ప్రయాణిస్తున్నవారు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. నైగర్ వెళ్లదలచినవారు కూడా అక్కడ సాధారణ పరిస్థితుల నెలకొనేవరకు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. నైగర్‌లో దాదాపు 250 మంది భారతీయులు ఉన్నారని తెలిపారు. 

నైగర్‌లో ఉన్న భారతీయులు మన దేశం చేపట్టిన ఇండియన్ మిషన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని, వారందరి బాధ్యతలను ఎంబసీ చూసుకుంటుందని అరిందమ్ బాగ్చి తెలిపారు. రిజిస్టర్ చేసుకున్న భారతీయుల ప్రయాణానికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. భూభాగం ద్వారానే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

నైగర్‌ ప్రెసిడెంట్ బజౌమ్‌ను తొలగించినట్లు ఆ దేశ ప్రెసిడెన్షియల్ గార్డ్ సభ్యులు జాతీయ టెలివిజన్‌లో జూలై 26న ప్రకటించారు. కొన్ని రోజుల తర్వాత ప్రెసిడెన్షియల్ గార్డ్‌కు అధిపతిగా పనిచేసిన జనరల్ అబ్దురహమనే ట్చియాని నైజర్‌కు కొత్త సైనిక నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో తిరుగుబాటు మొదలైంది. 

ఇదీ చదవండి:  Flying Kiss Row: 'మా సార్‌కు అమ్మాయిలు తక్కువా..?' కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement