విడిపోవడానికే బ్రిటన్ వాసి పట్టం
లండన్: బ్రిగ్జిట్ ఫలితాలలో ఎగ్జిట్పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. బ్రిటన్ వాసులు యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవడానికే మొగ్గుచూపారు. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్లో రెండు శాతం ఓట్లు స్వల్ప తేడాతో 'బ్రెగ్జిట్' వాదన గెలుపొందింది. దీంతో రెండో ప్రపంచ యుద్దం అనంతర కాలం నుంచి యూరప్ ఐక్యతలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఐరోపా సమాఖ్య(ఈయూ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. మొత్తానికి 52 శాతం ఓటర్లు విడిపోవాలని, 48 శాతం ఓటర్లు కలిసుండాలని తీర్పుఇచ్చారు.
బ్రెగ్జిట్ ఫలితాలతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. పౌండ్ విలువ భారీగా నష్టపోయింది. భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 900 పాయింట్ల వరకూ కోల్పోయింది. రూపాయి విలువ పతనమైంది. ఈ ఫలితాలతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ రాజీనామా చేయాలని ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.