
సెలవు ఇవ్వలేదని కాల్చేశాడు
కేరళ: బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్పై హెడ్ కానిస్టేబుల్ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇన్స్పెక్టర్ రాంగోపాల్ మీనా (45) అక్కడికక్కడే మృతి చెందాడు. కేరళ కాజికోడ్ జిల్లా వటకరలో గత రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ నెల 16న కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించేందుకు బీఎస్ఎఫ్ సిబ్బంది వటకరలోని ఇస్లామిక్ అకాడమీ స్కూల్ వద్ద బస చేశారు. అయితే సెలవు మంజూరు చేసే విషయంలో రాంగోపాల్ మీనాకు, హెడ్ కానిస్టేబుల్ ఉమేష్ ప్రసాద్ సింగ్ కు మధ్య వాగ్వివాదం జరిగినట్లు సమాచారం.
సెలవు మంజూరు చేసేందుకు ఇన్స్పెక్టర్ అంగీకరించకపోవటంతో ఆగ్రహించిన ఉమేష్ ప్రసాద్ తన సర్వీస్ రివాల్వర్తో ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న వడకర పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇవాళ పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ఉమేష్ ప్రసాద్ సింగ్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.