సమ్మె చేసిన జూనియర్ డాక్టర్లు (ఫైల్ ఫొటో)
హైదరాబాద్ సిటీ: హజరు శాతం తగ్గి వార్షిక పరీక్షలకు అనర్హులైన జూనియర్ డాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. తెలంగాణలో గత ఏడాది రెండు నెలల పాటు సమ్మె చేసిన కారణంగా వారికి హాజరు తగ్గింది. సమ్మె కాలం 62 రోజులను స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈనెల 21న నిర్వహించనున్న వైద్య విద్య పీజీ డిగ్రీ, డిప్లొమా వార్షిక పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని జూనియర్ డాక్టర్లకు కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయాన్ని విజయవాడలోని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి విన్నవించి విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది.