
సిక్ లీవ్, పేరెంటల్ లీవ్ వంటి లీవ్స్ అన్నీ కూడా కంపెనీ విధివిధానాలు లేదా నియమాల మీద ఆధారపడి ఉంటాయి. లీవ్స్ విషయంలో కొన్ని కంపెనీలు కఠినంగా వ్యవహరిస్తే.. మరికొన్ని కంపెనీలు ఉదారంగా ఉంటాయి. ఇటీవల ఓ కంపెనీ లీవ్స్ విషయంలో ఓ కొత్త రూల్ పాస్ చేస్తూ మెమో రూపొందించింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన మెమోలో ''పిల్లల అనారోగ్యం'' ఉద్యోగి సెలవు తీసుకోవడానికి సరైన కారణం కాదని పేర్కొన్నారు. మీ పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కాల్ చేసి లీవ్ తీసుకోవడం కుదరదు. ఎందుకంటే మేము మీ పిల్లలను పనిలో పెట్టుకోవడం లేదు. మీరే పనిచేయాలి. కాబట్టి ఈ కారణంతో లీవ్ తీసుకోవడానికి అవకాశం లేదు.

ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఉద్యోగుల విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అన్నారు. అనారోగ్యంతో ఉన్న బిడ్డను ఆఫీసుకు తీసుకురావాలా? అంటూ కొందరు ప్రశ్నించారు. ఈ రూల్ ఏ కంపెనీ పెట్టిందో చెప్పండి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: వైకల్యాన్ని జయించి.. బిలియనీర్‌గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీ
ఉద్యోగులను పనిలో పెట్టుకునే ముందు.. వారికి తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులు ఎవరూ లేకుండా ఉండేలా చూసుకోండి. ముందు వెనుక ఎవరూ లేని అనాథలను మీ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వండి. అప్పుడు సరిపోతుంది అంటూ ఓ యూజర్ తీవ్రంగా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment