సాధారణంగా మనం వారంలో ఆరు రోజులు కష్టపడి ఒకరోజు మాత్రం సెలవు తీసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకోవడమో లేక సరదాగా ఎంజాయ్ చేయడమో చేస్తుంటాం. కానీ కొందరికి మాత్రం కనీసం ఆ వెసులుబాటు కూడా ఉండదు. ఉదాహరణకు ఒక ఉద్యోగి యజమాని పనిరాక్షసుడు అయితే మాత్రం ఆ ఉద్యోగులకు ఇక చుక్కలే.అయితే రోజులో ఎనిమిది గంటలే పనిచేయాలనే నిబంధనను కొందరు యజమానులు తుంగలో తొక్కి తమ ఉద్యోగులతో ఎక్కువ పని చేయించుకుంటారు.
ఆ సమయంలో తమకు కడుపునొప్పో.. జ్వరమో అని అబద్ధం చెప్పి పని నుంచి తప్పించుకోవాలని చూస్తారు. అచ్చం అదే తరహాలో తాజాగా ఒక వ్యక్తి పని నుంచి తప్పించుకోవడానికి పెద్ద మాప్టర్ ప్లాన్ వేశాడు. సదరు వ్యక్తి ఒక సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. కొన్నిరోజులుగా అతని బాస్ ఎక్కువ పని చేయిస్తుండడంతో ఆ వ్యక్తి లీవ్ అడిగితే ఇవ్వడని.. బాస్‌ను ఫూల్ చేసి సెలవు దక్కించుకోవాలన్ని చూశాడు. అందుకోసం ఒక కస్టమర్ బిల్లు చెల్లించేందుకు రాగా.. ఆమె బిల్లును రెడీ చేస్తూ తలపట్టుకున్నాడు. కస్టమర్ క్రెడిట్ కార్డు ఇచ్చేలోపే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో షాకైన మహిళ కస్టమర్ ఓనర్‌ను పిలిచింది. ఓనర్ వచ్చి అతన్ని పక్కన కూర్చోబెట్టి కాసేపటి తర్వాత రెస్ట్ తీసుకోమని ఇంటికి పంపించేశాడు.
అలా ఓనర్‌ను ఫూల్ చేసి సెలవు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను తానే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పైగా తాను చేసిన పనిని గొప్పగా చెప్పుకుంటూ రాసుకొచ్చాడు. ఒకవేళ మీరు కూడా పనినుంచి తప్పించుకోవాలంటే ఇలాంటి పని చేయండి.. రిప్లై తొందరగా వస్తుంది. ఇక నా విషయం ఏంటంటే.. పనికి వచ్చే ముందు రోజు నాకు కాస్త మందు ఎక్కువైంది. ఆ హ్యాంగోవర్ పనికి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది. మా ఓనర్ సెలవు అడిగినా ఇవ్వడని తెలసి.. ఈ ప్లాన్ వేశాను అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు 1 మిలియన్‌కు పైగా వీడియోనూ వీక్షించారు.
చదవండి: గప్‌చుప్‌లు మనుషులకే కాదు.. మాకు ఇష్టమే
What’s the best way you’ve ever blagged getting off work sick this is mine it was Boxing Day I was hungover and 18 and wanted to go out later so decided to pull this off 😭 made sure the manager was there as well pic.twitter.com/wIBuu2KWGL
— elpedro ⭐️⭐️ (@ElpedroThe2nd) June 3, 2021
Comments
Please login to add a commentAdd a comment