ఇన్ని సెలవులా.. రాహుల్ది తప్పే: దిగ్విజయ్ | Ahead of Rahul Gandhi's return, Digvijaya Singh says timing of his long leave was wrong | Sakshi
Sakshi News home page

ఇన్ని సెలవులా.. రాహుల్ది తప్పే: దిగ్విజయ్

Published Sun, Apr 5 2015 8:35 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

ఇన్ని సెలవులా.. రాహుల్ది తప్పే: దిగ్విజయ్ - Sakshi

ఇన్ని సెలవులా.. రాహుల్ది తప్పే: దిగ్విజయ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ వ్యవహారాల కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మరోసారి సొంతపార్టీని ఇరుకున పడేశారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ వ్యవహారాల కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మరోసారి సొంతపార్టీని ఇరుకున పడేశారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇన్ని రోజులు సెలవు తీసుకొని తప్పుచేశారని అన్నారు. మరో వారంలో రాహుల్ తిరిగి వస్తున్నారని, అనంతరం ఆయనకు పార్టీ పూర్తిస్థాయి పగ్గాలు అందించే కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ప్రచారం జరుగుతుండగా ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే రాహుల్ సెలవులపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా ఇప్పుడు దిగ్విజయ్ వ్యాఖ్యలు కూడా వాటికి ఊతమిచ్చేలా ఉన్నాయి.

ఓ వార్తా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ సెలవు తీసుకున్నారన్న విషయం అందరికి తెలుసని, అయితే, ఇంతా సుదీర్ఘంగా తీసుకోవడం మాత్రం తప్పని చెప్పారు. రాహుల్కు పార్టీ పగ్గాలు అప్పగించాలని చెప్పేవారిలో తాను ముందువరుసలో ఉంటానని ఎప్పటి నుంచో ఆ విషయం చెప్తూనే ఉన్నానని అన్నారు. అయితే, పార్టీ బాధ్యతలు రాహుల్కు వచ్చాక కూడా సోనియాగాంధీ ఆమె సేవలు పార్టీ కోసం కొనసాగించాలని అన్నారు. ఆమె ఎప్పటికీ మార్గదర్శకురాలిగా ఉండాల్సిందేనని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement