సోనియా తప్పుకోవాలి.. రాహుల్ రావాలి | Rahul Gandhi should take over from Sonia, demands Digvijaya Singh | Sakshi
Sakshi News home page

సోనియా తప్పుకోవాలి.. రాహుల్ రావాలి

Published Sat, Nov 1 2014 9:11 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

సోనియా తప్పుకోవాలి.. రాహుల్ రావాలి - Sakshi

సోనియా తప్పుకోవాలి.. రాహుల్ రావాలి

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలకు సిద్దం అవుతున్న తరుణంలో పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలకు సిద్దం అవుతున్న తరుణంలో పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన తల్లి సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీని పునరుత్తేజితం చేయాల్సిన బాధ్యత రాహుల్ మీద ఉందని, అందుకు సమయం కూడా ఆసన్నమైందని అన్నారు. రాహుల్ పార్టీ అధ్యక్షుడు అయ్యేందుకు ఇంకా సమయం ఆసన్నం కాలేదన్న వాదనలను ఆయన ఖండించారు. ప్రస్తుతం పార్టీ చాలా దారుణ పరిస్థితుల్లో ఉందని అంతా అంటున్నారని, కానీ సీపీఎం, ఆర్జేడీ లాంటి పార్టీలు మునిగిపోతున్నా ఎవరూ పట్టించుకోరేమని డిగ్గీ రాజా ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రస్తుతం సాగుతోంది. అది ఈ ఏడాది చివరకు పూర్తవుతుంది. 2015లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ 38 ఏళ్ల వయసులో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారని, మౌలానా ఆజాద్ అయిఏత 35 ఏళ్లకే పదవి చేపట్టారని గుర్తు చేశారు. రాహుల్ బాబాకు ఇంతకు మించి మంచి తరుణం దొరకబోదని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement