రాయ్‌బరేలీ ప్రచారంలో సోనియా గాంధీ భావోద్వేగం
రాయ్‌బరేలి: ‘నా కుమారుడిని రాయ్‌బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నా. రాహుల్ మిమ్మల్ని నిరాశపర్చడు’ అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ శుక్రవారం రాయ్‌బరేలీలో ప్రచార సభలో పేర్కొన్నారు. ఎంపీగా 20 ఏళ్లు మీకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందకు ధన్యావాదాలని అన్నారు. ‘నాకున్న ప్రతిదీ మీరిచి్చందే. కాబట్టి సోదరసోదరీమణులారా నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా. మీరంతా నన్ను మీ దానిగా భావిస్తారు’ అని అన్నారు.
ఓటర్లతో భావోద్వేగ పూరితమైన బంధాన్ని నెలకొల్పే ప్రయత్నంలో రాహుల్‌నీ మీ సొంతవాడిగా భావించాలని విజ్ఞప్తి చేశారు. వేదికపై రాహుల్, ప్రియాంక గాం«దీలు సోనియా పక్కన నిలబడ్డారు. ‘ఇందిరా గాం«దీ, రాయ్‌బరేలీ ప్రజలు నాకు నేర్పిన విలువలు, పాఠాలనే నేను రాహుల్, ప్రియాంకలకు నేర్పాను. అందరినీ గౌరవించండి. బలహీనుల పక్షాన నిలబడి వారిని కాపాడండి. అన్యాయాలను ఎదిరించండి.
ప్రజల హ క్కుల కోసం పోరాడండి. భయపడొద్దు. పోరాటాలు, సంప్రదాయాల్లో మీ మూలాలు బలంగా ఉన్నాయి’ అని వారిద్దరికీ నేర్పానని సోనియా గాంధీ అన్నారు. సోనియా తొలిసారిగా 2004లో రాయ్‌బరేలి ఎంపీగా గెలిచారు. రాజ్యసభకు ఎన్నికై ఇటీవల రాజీనామా చేసేదాకా 20 ఏళ్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ బరిలో ఉన్నారు.
20 ఏళ్లు ఎంపీగా సేవ చేసుకునే అవకాశాన్ని తనకు రాయ్‌బరేలీ ప్రజలు కలి్పంచారని, ఇది తన జీవితంలో అమూల్యమైన ఘట్టమని సోనియా పేర్కొన్నారు. గత 100 ఏళ్లుగా తన కుటుంబం మూలాలు ఇక్కడి నేలతో ముడిపడి ఉన్నాయన్నారు. ఈ బంధం ఎంతో పవిత్రమైనదని, గంగా మాతతో అవధ్, రాయ్‌బరేలి రైతులకు ఉన్న బంధం లాంటిదే ఇదని పేర్కొన్నారు.
రాయ్‌బరేలీకి ఇందిరా గాంధీ హృదయంలో ప్రత్యేక స్థానముందని, ఆమె పనిని తాను దగ్గరగా గమనించానని, రాయ్‌బరేలీ ప్రజల పట్ల ఇందిరకు ఎనలేని అభిమానమని పేర్కొన్నారు. అనారోగ్య కారాణాలు వల్ల సోనియా గాంధీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ కుమారుడి కోసం శుక్రవారం ప్రచారం చేయడం గమనార్హం.
సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా ఈ సభలో పాల్గొన్నారు. సోనియాకు ముందు మాట్లాడిన రాహుల్ దేశంలోని యువత ఒక నిశి్చతాభిప్రాయానికి వచ్చారని, వారు మోదీని కోరుకోవడం లేదని తెలిపారు. జూన్ 4 తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, అది ప్రజాప్రభుత్వమని చెప్పారు. భారత రాజ్యాంగ ప్రతిని చూపుతూ దీన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు చింపి పాడేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.
రాయ్‌బరేలీతో సమానంగా అమేథీని చూస్తా
తాను గెలిస్తే అభివృద్ధి విషయంలో రాయ్‌బరేలి, అమేథీలను సమానంగా చూస్తానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అమేథీలో మూడుసార్లు ఎంపీగా నెగ్గిన రాహుల్ 2019లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి, తమ కుటుంబానికి నమ్మినబంటు కిశోరీలాల్ శర్మ తరఫున రాహుల్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌తో కలిసి శుక్రవారం ప్రచారం నిర్వహించారు.
‘రాయ్‌బరేలిలో అభివృద్ధి పనులకు రూ. 10 ఖర్చు చేస్తే అదే పది రూపాయలు అమేథిలోనూ ఖర్చు పెడతాం.. అది నా హామీ’ రాహుల్ పేర్కొన్నారు. అమేథీ ప్రజలకు 40 ఏళ్ల పాటు నిస్వార్థంగా సేవలందించినందుకు కిశోరీలాల్ శర్మకు ధన్యవాదాలు చెప్పారు. అగి్నవీర్ నియామక విధానాన్ని రద్దు చేసి పరి్మనెంట్ నియామక పద్ధతిని తీసుకొస్తామని.. దీంట్లో పెన్షన్‌కు కూడా అవకాశం ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment