ఛత్తీస్‌గఢ్‌లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ (హెచ్‌ఎల్‌యూ) విద్యార్థినులకు పీరియడ్స్ సెలవు విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ ఏడాది జూలై ఒకటి నుంచి యూనివర్శిటీలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
హెచ్‌ఎన్‌ఎల్‌యు చేపట్టిన ‘హెల్త్ షీల్డ్’ కార్యక్రమంలో భాగంగానే ఈ సెలవు విధానం అమలు చేసినట్లు యూనివర్సిటీ తెలియజేసింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వీ.సీ. వివేకానందన్ మాట్లాడుతూ యువ విద్యార్థినుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పీరియడ్స్ సెలవు విధానాన్ని అమలు చేయడం మెచ్చుకోదగిన విధానమని అన్నారు. దీనికి మద్దతిచ్చినందుకు అకడమిక్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
యూనివర్శిటీ ప్రతినిధి మాట్లాడుతూ ఈ విధానంలో విద్యార్థినులు క్యాలెండర్ నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవు తీసుకోవచ్చు. భవిష్యత్తులో పరీక్షా రోజులలో కూడా ఇటువంటి ప్రత్యేక సెలవులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. క్రమరహిత ఋతు సిండ్రోమ్ లేదా పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వంటి రుగ్మతలు ఉన్న బాలికలు ఒక సెమిస్టర్‌లో ఆరు రోజుల వరకూ సెలవు తీసుకోవచ్చని అన్నారు.
అంతకుముందు 2023 జనవరిలో కేరళలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దేశంలో తొలిసారిగా పీరియడ్స్ సెలవు విధానాన్ని ప్రారంభించింది. అనంతరం పంజాబ్ యూనివర్శిటీ ఆఫ్ చండీగఢ్, గువాహటి యూనివర్శిటీ ఆఫ్ అస్సాం, నల్సార్ యూనివర్శిటీ (హైదరాబాద్), అస్సాంలోని తేజ్‌పూర్ యూనివర్శిటీలు కూడా ఈ విధమైన సెలవు విధానాన్ని ప్రారంభించాయి.
Comments
Please login to add a commentAdd a comment