యూపీలోని యోగీ సర్కారు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు శనివారం(ఈరోజు) సెలవును రద్దుచేసింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో ప్రారంభమయ్యే అఖిల భారత విద్యా సదస్సు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని యోగీ సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపధ్యంలో శనివారం పాఠశాలలు తెరుచుకున్నాయి.
జాతీయ విద్యావిధానం మూడో వార్షికోత్సవం సందర్భంగా 29న న్యూఢిల్లీలో నిర్వహించే అఖిల భారత విద్యా సమాఖ్య కార్యక్రమాన్ని యూపీలోని పాఠశాలలో ప్రసారం చేయాలని జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యూపీ డైరెక్టర్ జనరల్ ఎడ్యుకేషన్ విజయ్ కిరణ్ ఆనంద్ జారీ చేసిన ఒక ఉత్తర్వులో ప్రధానమంత్రి అఖిల భారత విద్యా సమాగమం ప్రోగ్రాం ప్రారంభ సెషన్‌ను పాఠశాల స్థాయి వరకు వెబ్‌కాస్ట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
ఈ సెషన్‌లో పాల్గొనే వారి వివరాలను నేటి సాయంత్రంలోగా విద్యా మంత్రిత్వ శాఖకు పంపాలని ఆదేశించినట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే అంతకుముందు యూపీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. తరువాత దానిని రద్దు చేశారు.
ఇది కూడా చదవండి: ఆర్డర్ పెట్టకుండానే ఆమె ఇంటికి 100కు పైగా పార్సిళ్లు.. ఆరా తీస్తే..
Comments
Please login to add a commentAdd a comment