moharam
-
అనంతపురంలో మొహరం పండుగ వేడుకలు (ఫొటోలు)
-
ప్రధాని మోదీ ప్రోగ్రాం ఉందని మొహర్రం సెలవు రద్దు..!
యూపీలోని యోగీ సర్కారు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు శనివారం(ఈరోజు) సెలవును రద్దుచేసింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో ప్రారంభమయ్యే అఖిల భారత విద్యా సదస్సు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని యోగీ సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపధ్యంలో శనివారం పాఠశాలలు తెరుచుకున్నాయి. జాతీయ విద్యావిధానం మూడో వార్షికోత్సవం సందర్భంగా 29న న్యూఢిల్లీలో నిర్వహించే అఖిల భారత విద్యా సమాఖ్య కార్యక్రమాన్ని యూపీలోని పాఠశాలలో ప్రసారం చేయాలని జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యూపీ డైరెక్టర్ జనరల్ ఎడ్యుకేషన్ విజయ్ కిరణ్ ఆనంద్ జారీ చేసిన ఒక ఉత్తర్వులో ప్రధానమంత్రి అఖిల భారత విద్యా సమాగమం ప్రోగ్రాం ప్రారంభ సెషన్‌ను పాఠశాల స్థాయి వరకు వెబ్‌కాస్ట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఈ సెషన్లో పాల్గొనే వారి వివరాలను నేటి సాయంత్రంలోగా విద్యా మంత్రిత్వ శాఖకు పంపాలని ఆదేశించినట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే అంతకుముందు యూపీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. తరువాత దానిని రద్దు చేశారు. ఇది కూడా చదవండి: ఆర్డర్ పెట్టకుండానే ఆమె ఇంటికి 100కు పైగా పార్సిళ్లు.. ఆరా తీస్తే.. -
అగ్నిగుండంలో పడి వ్యక్తి సజీవదహనం
-
ముదిరిన పంచాయితీ
మిడ్జిల్(జడ్చర్ల): మండలంలోని వల్లబ్‌రావుపల్లి లో ఆదివారం ఉద్రిక పరిస్థితి చోటుచేసుకుంది. పాతకక్షల నేపథ్యంలో జరిగిన గొడవ ముదిరి ఓ వర్గంవారిపై మరో వర్గం దాడులకు దిగింది. దీంతో ఏడుగరికి గాయాలయ్యాయి. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా.. మొహర్రం నాటి గొడవ గత మొహ్రరం పండుగ సందర్భంగా వల్లభ్‌రావుపల్లిలో ముదిరాజ్ కులానికి చెందిన నర్సింహ చేతివేలిని జంగం రామ్‌గౌడ్ కొరకడంతో గొడవ ప్రా రంభమైంది. అప్పట్లో ఇరువర్గాల వారు సర్దిచెప్పడంతో సద్దుమణిగింది. అయితే, ఆ గొడవను దృష్టిలో ఉంచుకుని శనివారం సాయం త్రం రామ్‌గౌడ్.. బండారి కృష్ణయ్యను రాయితో కొట్టగా ముదిరాజ్ కులస్తులు రా మ్‌గౌడ్‌ను నిలదీశారు. అక్కడ మాటమాట పెరగగా రామ్‌గౌడ్‌కు రెండు చెంపదెబ్బలు కొట్టి ఇంటికి పంపించారు. ఈ విషయాన్ని ఆయన తన కుటుంబీలకు చెప్పడంతో రామ్‌గౌడ్‌తో పాటుగా జంగయ్యగౌడ్, మహేష్‌గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, రవికుమార్ గౌడ్ కలిసి తాటిచెట్లు గీసే కత్తులతో ముదిరాజ్‌వర్గం వారిపై మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో బండారి కృష్ణయ్య, నర్సింహ, నరేష్, యాదగిరి, భగవంత్, ఆనంద్, గండేలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్సనిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన ఎస్పీ వల్లభ్‌రావుపల్లిలో ఆదివారం ఉదయం కత్తులతో దాడి చేసిన ఘటన గురించి తెలుసుకున్న ఎస్పీ రెమా రాజేశ్వరి వివరాలు ఆరాతీశారు. సాయంత్రం గ్రామానికి వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. ఎస్పీవెంట డీఎస్పీ భాస్కర్‌గౌడ్, సీఐ రవీంర్‌రెడ్డి, ఏఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. -
భక్తిశ్రద్ధలతో మొహర్రం
బనగానపల్లె: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తర్వాత ఏపీలోని బనగానపల్లె పట్టణంలో ఆ స్థాయిలో మొహర్రం నిర్వహించడం కర్నూలు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లె ప్రత్యేకత. మొహర్రం పీర్ల ఊరేగింపులో భాగంగా షియా మతస్తులు శోక గీతాలు ఆలపిస్తూ బ్లేడ్లు, చురకత్తులతో ఎద, వీపుపై మాతం నిర్వహించారు. బుధవారం బనగానపల్లె నవాబు వంశస్తుల ఆధ్వర్యంలో సుమారు 200 పీర్లను పట్టణంలో ఊరేగించారు. మతసామరస్యానికి ప్రతీకగా నిర్వహించే ఈ ఊరేగింపును ఆద్యంతం భక్తిశ్రద్ధలతో చేపట్టారు. స్థానిక నవాబుకోట నుంచి ప్రారంభమైన పీర్ల ఊరేగింపులో బనగానపల్లె నవాబు మీర్ ఫజిల్ అలీఖాన్, ఆయన కుమారుడు గులాం అలీఖాన్ పీర్ల వెంట శోకగీతాలు ఆలపిస్తూ నడవగా షియా మతస్తులు నల్లటి వస్త్రాలు ధరించి పీర్ల ఊరేగింపును కొనసాగించారు. ఈ సందర్భంగా బ్లేడ్లు, చురకత్తులతో ఎదపై మాతం నిర్వహిస్తూ భక్తిని చాటుకున్నారు. కొండపేటలోని ఇమాం ఖాసీం పీరు జుర్రేరు వద్దకు చేరుకున్న అన్ని పీర్లను ఆలింగనం చేసుకుంది. ఇక్కడకు వచ్చిన సుమారు 200 పీర్లను జుర్రేరువాగులో శుద్ధిచేసిన అనంతరం తిరిగి చావిడిలోకి చేర్చారు. మాతంను తిలకించేందుకు బనగానపల్లె పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సంతాప సూచకంగా పట్టణంలోని వ్యాపార దుకాణాలు, సినిమా థియేటర్లు మూసివేశారు. -
రుధిర తర్పణం
మచిలీపట్నం : మొహర్రం సందర్భంగా ‘యా హుస్సేన్... యా ఆలీ..’ అనే నినాదాలతో స్థానిక కోనేరుసెంటరు బుధవారం మార్మోగింది. మహ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్, ఆయన 72 మంది అనుచరుల త్యాగాన్ని స్మరిస్తూ ముస్లింలు రక్తం చిందించారు. మచిలీపట్నంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు కోనేరుసెంటరుకు చేరుకుని ఇమాం హుస్సేన్, ఆయన అనుచరులు కర్భలా మైదానంలో ప్రాణత్యాగం చేసిన వైనాన్ని స్మరించుకున్నారు. తొలుత గిరియోహజరత్ హజ్జత్ (చిన్నపార్టీ) సభ్యులు చింతచెట్టు సెంటరులోని సాహెబ్ పంజా నుంచి రాజుపేట మీదుగా కోనేరుసెంటరు వరకు జుల్జనా (ర్యాలీ) నిర్వహించారు. కోనేరుసెంటరులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మస్జిదా ఇమానే గురువు జమానా పేషిమా నమాజ్ చేశారు. కర్బలా మైదానంలో ఇమామ్ హుస్సేన్, ఆయన 72 మంది అనుచరులు ధర్మయుద్ధం చేసిన తీరు, ప్రవక్తకు ఆయన అనుచరులకు మూడురోజులపాటు తాగునీరు ఇవ్వకుండా హింసించిన విధానాన్ని గురువు వివరించారు. చిన్న పార్టీ కోనేరుసెంటరును వీడిన అనంతరం ఇనగుదురుపేటలోని బారేమాం పంజా నుంచి గిరియోహజరత్‌హజ్జత్(పెద్ద పార్టీ) సభ్యులు ఇనుగుదురుపేట నుంచి ర్యాలీగా బయలుదేరి జవ్వారుపేట, బుట్టాయిపేట, వల్లూరిరాజా సెంటరు మీదుగా కోనేరుసెంటరు వరకు జుల్జనా నిర్వహించారు. అలనాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ ... పవిత్రయుద్ధంలో మరణించిన ఇమాం హుస్సేన్ మృతదేహం తీసుకొచ్చేందుకు ఆయన కుమార్తె బీసకీనా శవపేటికను అలంకరించి తీసుకువెళ్లడాన్ని గుర్తు చేస్తూ యువతులు, చిన్నారులు శవపేటికను మోసుకుంటూ కోనేరుసెంటరుకు వచ్చారు. ఇమాం హుస్సేన్ మరణానంతరం నాటి యుద్ధ వాతావరణం(జుల్జనా)ను గుర్తుకు తెస్తూ గుర్రాలపై వస్త్రాలు, కత్తులను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి పీర్లను ఊరేగింపుగా కోనేరుసెంటరుకు తీసుకువచ్చారు. మళ్లీ వాటిని ఊరేగింపుగా తీసుకువెళ్లి పంజాల వద్ద ప్రతిష్టించారు. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దట్టీ సమర్పించారు. శాసనసభ మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, మున్సిపల్ చెర్మన్ మోటమర్రి వెంకటబాబాప్రసాద్ ,షేక్ అచ్చాబా, అహ్మద్ హుస్సేన్, ఖాజాబేగ్, సయ్యద్‌ఖాజా, ఇలియాస్‌పాషా, మౌలాలి పాల్గొన్నారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్, పలువురు సీఐలు, ఎస్‌లు బందోబస్తును పర్యవేక్షించారు. -
నేడు ఆంధ్రబ్యాంకులో చిల్లర నాణేల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): విజయ దశమి, మొహర్రం, దీపావళి పర్వదినాలను పురష్కరించుకుని బుధవారం నాణేల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు ఆంధ్రబ్యాంకు డీజీఎం గోపాకృష్ణ తెలిపారు. మార్కెట్లో చిల్లర కొరత ఎక్కువగా ఉన్నందున దీనిని అధిగమించేందకు ఆంధ్రబ్యాంకు కర్నూలు ప్రజల అవసరార్థం చిల్లర పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పార్క్ రోడ్ శాఖలో రూ.1, 2, 5 నాణేల పంపిణీ ఉదయం 11 గంటలకు చేపడుతున్నామని ఈ అవకాశాన్ని ఖాతాదారులు తదితరులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
సన్మార్గం : మొహర్రం స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి
మొహర్రం అనగానే అందరికీ గుర్తు వచ్చే పేర్లు హసన్, హుసైన్ (ర అన్ హుం). ముస్లింలకే కాదు. ముస్లిమేతర సోదరులకు కూడా ఆ మహనీయుల త్యాగాలు మనసులో మెదులుతాయి. ఆనాడు జరిగిన ‘కర్బలా’ దుర్ఘటన, దుర్మార్గుల దురాగతాలు, ఆ మహనీయుల అనుచరులపై జరిగిన దౌర్జన్యాలు, వారి కుటుంబీకుల దీనస్థితి, పసిబిడ్డల హాహాకారాలు, శాంతిసామరస్యాలకు వారు చేసిన ప్రయత్నాలు, రాచరిక నిర్మూలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు వారు చేసిన కృషి, వేలాది శత్రుసైన్యాన్ని గడగడలాడించి యుద్ధరంగంలోనే అమరులైన ఆ వీరఘట్టం, మృతవీరుల కళేబరాలతో దుష్టుల, దుర్మార్గులైన యజీద్ సైన్యం అవలంబించిన జుగుప్సాకరమైన వైఖరి, వారి ఫాసిస్టు చరిత్ర ఒక్కసారిగా అందరి హృదయాల్లో కదలాడుతుంది. ముహమ్మద్ ప్రవక్త నిర్యాణం తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో హ. అబూబక్ ్రసిద్ధిఖీ (ర) ఖలీఫాగా (ప్రజాప్రతినిధి)గా ఎన్నికయ్యారు. ఆయన తరువాత వరుసగా హ. ఉమర్ (ర), హ. ఉస్మాన్ (ర), హ. అలీ(ర) గార్లు ఖలీఫాలుగా ఎంపికయ్యారు. వీరి పరిపాలనా కాలంలో న్యాయం, ధర్మం నాలుగుపాదాలపై నడిచాయి. అన్ని రంగాల్లోనూ సమతూకం నెలకొని ఉండేది. ఎలాంటి హెచ్చుతగ్గులు, తారతమ్యాలు లేకుండా సమన్యాయం, గౌరవమర్యాదలు లభ్యమయ్యేవి. ఈవిధంగా వీరి పరిపాలనాకాలం ప్రపంచ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయాన్ని సృజించింది. చివరి ఖలీఫా హ. అలీ (ర) తరువాత ప్రజలు యథాప్రకారం తమ ప్రతినిధిగా హ. హసన్ (రజి) గారిని ఎన్నుకున్నారు. కాని కొన్ని అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ఆయన అధికారాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. తరువాతి పరిణామాల్లో యజీద్ తనను తాను రాజుగా ప్రకటించుకుని గద్దెనెక్కారు. గత్యంతరం లేని స్థితిలో అత్యధికులు అతడి రాజరికాన్ని అంగీకరించవలసి వచ్చింది. ఈవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన దెబ్బ తగిలింది. ఈ పరిణామం ప్రజాస్వామ్య ప్రియులకు మింగుడు పడలేదు. వాళ్లు ఈ బలవంతపు రాచరికానికి ఎదురు తిరిగారు. ఉద్యమానికి నాయకత్వం వహించే బాధ్యత హ. ఇమామె హుసైన్ (రజి) భుజస్కంధాలపై పడింది. ఇస్లామీ ధర్మశాస్త్రప్రకారం ఏ సమస్యకైనా చర్చలు, సంప్రదింపులే పరిష్కారమార్గాలు. అందుకని ఇమామె హుసైన్ (రజి) ఆ మార్గాన్నే ఎంచుకున్నారు. యాజీద్తో చర్చలకోసమని అనుచరులు, కుటుంబంతో కలసి రాజధాని కుఫాకు బయలుదేరారు. కాని మార్గమధ్యంలోనే ‘కర్బలా’ అనే చోట యజీద్ సైన్యం ఇమాం పరివారాన్ని అడ్డగించి కయ్యానికి కాలుదువ్వింది. దాంతో ఇరువర్గాల మధ్య భీకరపోరు మొదలైంది. శతృవులతో శక్తివంచన లేకుండా పోరాడుతూ ఇమాం పరివార సభ్యులు ఒక్కొక్కరే నేలకొరిగారు. ధర్మ సంస్థాపన కోసం సాగిన ఈ పోరులో చివరకు ఇమాం హుసైన్ (రజి) ఒక్కరే మిగిలారు. అది మొహర్రం మాసం పదవతేదీ. శుక్రవారం. పోరు సాగుతూనే ఉంది. ఒకవైపు నమాజు సమయం మించిపోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నమాజును విస్మరించని ఆ మహనీయుడు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇమ్మని అడిగారు. అందుకు అంగీకరించిన శత్రుసైన్యం ఇమాం సజ్దా నుండి లేస్తే తమకు నూకలు చెల్లినట్లేనని భావించి, యుద్ధనీతికి తిలోదకాలిచ్చి, ప్రార్థనలో ఉన్న ఆ మహనీయుడిని సజ్దా స్థితిలోనే బరిశతో పొడిచి చంపారు. అనంతరం ఆనందంతో చిందులు తొక్కారు. మృతవీరుల తలలను వారి దేహాలనుంచి వేరుచేసి, బరిశలకు, బల్లాలకు గుచ్చి ఎగిరారు, పానకాలు చేసుకుని తాగారు. పలావులు వండుకుని తిన్నారు. ఇదీ క్లుప్తంగా ఆనాడు జరిగిన కర్బలా దుర్ఘటన. ఇమాం హుసైన్ (రజి) ఏ విలువల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టారో, ఆ విలువల పరిరక్షణ కోసం ప్రయత్నించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. విలువలు మంటగలసిపోతుంటే, పాలనావ్యవస్థ భ్రష్టుపట్టిపోతుంటే, చూస్తూ కూర్చోవడం ప్రజాస్వామ్య ప్రియుల లక్షణం ఎంతమాత్రం కాదు. వీటిని సమూలంగా మార్చాలంటే ‘మొహర్రం’ పేరుతో జరిగే అన్ని రకాల దురాచారాలని విసర్జించి, ఇమామె హుసైన్ (రజి) ఏ విలువలకోసం ప్రాణత్యాగం చేశారో ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవలసిందే! - యండి ఉస్మాన్‌ఖాన్ ఇస్లామీ ధర్మశాస్త్రప్రకారం ఏ సమస్యకైనా చర్చలు, సంప్రదింపులే పరిష్కారమార్గాలు. అందుకని ఇమామె హుసైన్ (రజి) ఆ మార్గాన్నే ఎంచుకున్నారు. యాజీద్తో చర్చలకోసమని అనుచరులు, కుటుంబంతో కలసి రాజధాని కుఫాకు బయలుదేరారు. కాని మార్గమధ్యంలోనే ‘కర్బలా’ అనే చోట యజీద్ సైన్యం ఇమాం పరివారాన్ని అడ్డగించింది.