ట్విట్టర్కు మరో అధికారి షాక్ | Twitter CTO Adam Messinger to leave in latest executive exodus | Sakshi
Sakshi News home page

ట్విట్టర్కు మరో అధికారి షాక్

Published Wed, Dec 21 2016 8:26 AM | Last Updated on Sat, Aug 25 2018 6:37 PM

ట్విట్టర్కు మరో అధికారి షాక్ - Sakshi

ట్విట్టర్కు మరో అధికారి షాక్

ట్విట్టర్కు మరో అధికారి షాకివ్వబోతున్నారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆడమ్ మెసింజర్ కంపెనీ నుంచి వైదొలగనున్నట్టు మంగళవారం ట్వీట్ చేశారు.

ట్విట్టర్కు మరో అధికారి షాకివ్వబోతున్నారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆడమ్ మెసింజర్ కంపెనీ నుంచి వైదొలగనున్నట్టు మంగళవారం ట్వీట్ చేశారు. అయితే సంస్థ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. సంస్థ భవిష్యత్తుపై పెరుగుతున్న అనిశ్చితకు అద్దం పడుతూ వరుసగా హై ప్రొఫైల్ ఎగ్గజిక్యూటివ్లు రాజీనామాల పరంపర కొనసాగుతోంది. మెసింజర్ గత ఐదేళ్లుగా ట్విట్టర్లో తన సేవలందిస్తున్నారు. 2013 మార్చిలో ఆయన ట్విట్టర్కు సీటీవోగా ఎంపికయ్యారు. 2011లో ట్విట్టర్లో చేరకముందు ఆయన ఒరాకిల్ కార్పొరేషన్కు డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు.
 
ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎడ్ హోకు అన్ని ప్రొడక్ట్, ఇంజనీరింగ్ బాధ్యతలను అప్పగించబోతున్నారని రీకోడ్ రిపోర్టు చేసింది. చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్గా మెసింజర్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, డిజైన్కు సంబంధించిన సేవలను పర్యవేక్షిస్తుండేవారు. శాన్ఫ్రాన్సిస్కోకు  చెందిన ట్విట్టర్ ఇటీవల హై ప్రొఫైల్ ఎగ్జిక్యూటివ్ల రాజీనామాతో తీవ్ర సతమతమవుతోంది. ఏడాది కంటే తక్కువ సమయంలోనే ముగ్గురు అధినేతలు దీనికి గుడ్ బై చెప్పారు. యూజర్ గ్రోత్ పెరుగుతుందనే వార్తలు వస్తున్నప్పటికీ ఈ రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉద్యోగుల తొలగింపు, సంస్థ కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతోపాటు తన వీడియో ప్లాట్ ఫాం వైన్ ఉపసంహరించుకోవడం తదితర అంశాలు తెలిసిన విషయాలే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement