దేశ రాజధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బుధవారం వరకు పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంది. సెలవులు పొడిగిస్తూ సర్క్యులర్ జారీ చేసిన గంటలోపే విద్యాశాఖ డైరెక్టరేట్ ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. సెలవు పొడిగింపుపై తగిన నిర్ణయం తీసుకున్న తర్వాత ఢిల్లీ ప్రభుత్వ విద్యా డైరెక్టరేట్ కొత్తగా మళ్లీ సర్క్యులర్ జారీ చేయనుంది.
దేశ రాజధాని ఢిల్లీలో చలిగాలులు, పొగమంచు కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలకు సెలవులు పొడిగించారు. జనవరి 10 వరకు పాఠశాలలు మూసివేయాలని విద్యాశాఖ డైరెక్టరేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే పొరపాటుగా సెలవుల ఉత్తర్వు జారీ అయ్యిందని విద్యా శాఖ పేర్కొంది. సెలవుల పొడిగింపుపై ఆదివారం తుది నిర్ణయం తీసుకోనున్నారు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో విపరీతమైన చలిగాలుల వీస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. పగటిపూట సూర్యకాంతి చాలా తక్కువగా ఉంటోంది. దట్టమైన పొగమంచు కారణంగా, విమానాలు, రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అటువంటి పరిస్థితిలో విద్యార్థులకు పిల్లలకు ఉపశమనం కలిగించేందుకు శీతాకాలపు సెలవులను పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment