హైదరాబాద్: నగరంలో ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ బిడ్స్ ఫైనల్ అయ్యాయి. ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు ఏర్పాటుకు వచ్చిన బిడ్స్‌లో రెండు కంపెనీలు షార్ట్ లిస్ట్ చేశారు. బిడ్స్ షార్ట్ లిస్ట్ అయిన కంపెనీల్లో L& T కన్స్ట్రక్షన్స్ , NCCలు ఉన్నాయి. పనితీరు, అనుభవం ఆధారంగా త్వరలో ఒక కంపెనీని ఫైనల్ చేస్తామని ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.
కాగా, రూ. 5,688 కోట్లతో 31 కి.మీ మేర ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు ఏర్పాటు చేయడానికి టీఎస్ సర్కార్ నడుంబిగించింది. దీనిలో భాగంగా మెట్రో రైలు ఏర్పాటు కోసం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఏర్పాటు చేశారు.
విమానాశ్రయ మెట్రో కారిడార్‌కు సమీపంలో అనేక వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పెద్దఎత్తున జరుగుతోంది. దాంతో పాటుశివార్లలో మధ్యతరగతి వారికోసం తక్కువ ఖర్చుతో నివాసప్రాంతాలను అభివృద్ధి చేసి అన్ని తరగతులవారు ఎయిర్‌పోర్ట్ మెట్రో ద్వారా గమ్యస్థానాలకు చేరుకొనేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే నాలుగు అదనపు స్టేషన్ల నిర్మాణానికీ ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment