
టోక్యో: జపాన్ బుల్లెట్ ట్రైన్స్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు జపాన్ మరో తాజా రికార్డును సృష్టించింది. భూకంప సమయంలోనూ ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చెరవేసే బులెట్ ట్రైన్‌ను రూపొందించింది. ఈ బుల్లెట్ రైలు వేగంగా, చాలా సున్నితంగా ప్రయాణిస్తుంది. గంటకు 360 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దాంతో పాటు భూకంపం సంభవించినప్పుడు ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకువెళ్లగలదు. (వినూత్న మాస్కు.. ధర రూ.3 వేలు!)
ఈ ట్రైన్ నంబర్ N700S - 'S' అంటే 'సుప్రీం' అని అర్థం. జూలై 1నుంచి ఇది సేవను అందిస్తోంది. ఇది టోక్యో- ఒసాకా స్టేషన్ల మధ్య నడుస్తోంది. 2019లో దీనికి సంబంధించిన టెస్ట్ రన్ చేశారు. 2020 జూలై నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రపంచంలోని వేగంగా నడిచే రైళ్లలో ఒకటి. దీని ఆపరేటింగ్ వేగం గంటకు 285 కిలోమీటర్లు. (సునామీ శోకం మరిచేలా... జపాన్ విజయ గీతిక)
Comments
Please login to add a commentAdd a comment