బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌కు శివసేన షాక్‌!  | Bullet Train Maharashtra Government Rejects NHSRC Proposal | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌కు శివసేన షాక్‌! 

Published Fri, Dec 25 2020 8:09 AM | Last Updated on Fri, Dec 25 2020 8:10 AM

Bullet Train Maharashtra Government Rejects NHSRC Proposal - Sakshi

థానే: అహ్మదాబాద్‌– ముంబై మధ్య ప్రతిపాదిత బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు శివసేన ఝలక్‌ ఇచ్చింది. రైల్వే లైను నిర్మాణానికి జిల్లాలో కావాల్సిన భూమిని ప్రాజెక్టుకు బదలాయించేందుకు శివసేన నేతృత్వంలోని థానే
మున్సిపల్‌ కార్పొరేషన్‌(టీఎంసీ) నిరాకరించింది.  థానే జిల్లాలోని షిల్‌– దాయ్‌ఘర్‌ ప్రాంతంలో 3,800 చదరపు మీటర్ల భూమిని రూ. 6కోట్ల పరిహారం తీసుకొని బదలాయించాలని నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌
లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ) ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను టీఎంసీ పాలక మండలి తోసిపుచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement