టోక్యో: జపాన్‌లో బుల్లెట్ రైలు 17 నిమిషాలు ఆలస్యమవడం హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణంగా బుల్లెట్ రైళ్లు నిమిషం ఆలస్యం కాకుండా షెడ్యూల్ ప్రకారం నడుస్తుంటాయి. అయితే అనూహ్యంగా బుల్లెట్ రైలు ఆలస్యమవడానికి ఓ పాము కారణమైంది. పాము రైలుపైకి ఎలా వచ్చిందనేదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
సాధారణంగా ఈ రైళ్లలో కొన్ని జంతువులను తీసుకెళ్లడానికి మాత్రం అనుమతి ఉంటుంది. పాములను మాత్రం అనుమతించరు. ప్రయాణికుల లగేజీని మాత్రం చెక్ చేసే నిబంధన లేదు. ఎవరైనా ప్రయాణికుల లగేజీలో పాము వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
జపాన్‌లో బుల్లెట్ రైలు 1964 సంవత్సరంలోనే ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో బుల్లెట్ రైలు నెట్‌వర్క్ 2700కిలోమీటర్లుగా ఉంది. బుల్లెట్ రైళ్ల ఆలస్యం సగటున నిమిషానికంటే తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం బుల్లెట్ రైలు స్పీడు గంటకు 300 కిలో మీటర్లు.
ఇదీ చదవండి.. జపాన్‌కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డు
Comments
Please login to add a commentAdd a comment