ఢిల్లీ : దేశంలో త్వరలోనే ఏడు కొత్త మార్గాల్లో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఢిల్లీ నుంచి వారణాసి, అహ్మదాబాద్, అమృత్‌సర్ వరకు మూడు రైళ్లు వారణాసి నుంచి హౌరా, ముంబై నుంచి నాగ్‌పూర్, హైదరాబాద్, చివరగా చెన్నై నుంచి మైసూర్ వరకు బుల్లెట్ రైళ్లును నడిపాలని భారత రైల్వేశాఖ యోచిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం భారత రైల్వేతో పాటు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఐఐ) ఆద్వర్యంలో త్వరలోనే భూసేకరణ జరగనున్నాయి. మంత్రి గడ్కరీ నేతృత్వంలోని మంత్రుల బృందం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. (2022 నాటికి పట్టాలపైకి 44 వందే భారత్ రైళ్లు)
దేశంలోని ఏడు ముఖ్యమైన మార్గాల్లో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే ఈ మార్గాల్లో రైల్వే కారిడర్‌కు సంబంధించిన వివరాలను ఎన్‌హెచ్‌ఐఐకు అందించిన రైల్వే శాఖ త్వరలోనే పనులు ప్రారంభించాల్సిందిగా కోరింది. ఈ మేరకు నోడల్ అధికారిని నియమించాలని కోరుతూ రైల్వే బోర్డు చైర్మన్ వి.కె. యాదవ్ ఈ మేరకు లేఖ రాశారు. అయితే లాక్‌డౌన్ కారణంగా చాలా ప్రాజెక్టుల నిర్మాణాలు ఆలస్యం ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. .81,000 కోట్ల రూపాయల భారీ రైల్వే ప్రాజెక్టు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పనులు సైతం ప్రస్తుతం మందకోడిగా సాగుతున్న నేపథ్యంలో కొత్తగా ఏడు మార్గాల్లో బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టు ప్రాధాన్యం సంతరించుకుంది. (భూకంపంలోనూ నడిచే బుల్లెట్ ట్రైన్!)
Comments
Please login to add a commentAdd a comment