దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి ఆర్డర్‌ను గెలుచుకున్నట్లు లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) తెలిపింది. ఈ మేరకు ఎల్ అండ్ టీ కన్‌స్ట్రక్షన్ 508 కిలోమీటర్ల పరిధిలో ప్రాజెక్ట్ ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనుంది. రూట్ నిర్మాణం పూర్తయిన తర్వాత, ఈ ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్ వల్ల రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ ప్రాజెక్ట్‌కు జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ నిధులు సమకూరుస్తోందని కంపెనీ తెలిపింది.
ఈ ప్రాజెక్ట్‌కు మహారాష్ట్రలో భూసేకరణ దాదాపు పూర్తయిందని ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ముంబై, థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగాలు పోనున్నాయా..?
దేశంలోనే ఈ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందని రైల్వే మంత్రి గతంలోనే చెప్పారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబయి చేరుకోవచ్చు. ఈ రైలు మార్గం ముంబై, థానే, వాపి, వడోదర, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లను కలుపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment