
'లక్ష కోట్ల లూటీకే మోదీ 'బుల్లెట్''
ప్రధాని నరేంద్రమోదీపై శివసేన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. రూ.1.08లక్షల కోట్లను లూటీ చేసేందుకే బుల్లెట్ రైలు ప్రాజెక్టును మోదీ తెరమీదకు తెచ్చారంటూ తన అధికార పత్రిక సామ్నాలో దుయ్యబట్టింది.
ముంబయి : ప్రధాని నరేంద్రమోదీపై శివసేన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. రూ.1.08లక్షల కోట్లను లూటీ చేసేందుకే బుల్లెట్ రైలు ప్రాజెక్టును మోదీ తెరమీదకు తెచ్చారంటూ తన అధికార పత్రిక సామ్నాలో దుయ్యబట్టింది. ఇది మోదీ అత్యంత ఖరీదైన డ్రీమ్ అని దాని పేరిట దేశం సొమ్మును దోపిడిచేయాలనుకుంటున్నారనితీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా ఈ మధ్య పీయూష్ గోయల్‌ను రైల్వే మంత్రిని చేశారని, ఆయన బీజేపీ కోశాధికారి కూడా అని, అందుకే ఆయనను ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టు కోసం రైల్వేమంత్రిని చేశారంటూ విమర్శించింది.
'ఈ ప్రాజెక్టు కోసం జపాన్ ప్రతి ఒక్కటి అందిస్తుంది.. నెయిల్స్ నుంచి రైళ్ల వరకు.. మానవ శక్తి వనరుల నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు ఇంకా చెప్పాలంటే సిమెంట్ నుంచి కాంక్రీట్ వరకు కూడా.. డబ్బు భూమి మాత్రం.. గుజరాత్, మహారాష్ట్రది. మొత్తం ఆదాయం మాత్రం టోక్యోకు వెళ్లిపోతుంది. ఈ లూటీని, మోసాన్ని ఎవరూ ప్రశ్నించకుండా మోదీ మానస పుత్రిక (బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు)కు మాత్రం అభినందనలు చెబుతున్నారు' అంటూ తీవ్ర వ్యాఖ్యలతో మండిపడింది.