ముంబై: ఉక్రెయిన్‌లో యుద్దం ఆపగలిగే ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులను ఆపాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘ఉక్రెయిన్‌లోని యుద్ధాన్ని ఆపగలిగే ప్రధాని మోదీ.. పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో జరగుతున్న దాడుల నుంచి కూడా హిందువులను ఖచ్చితంగా రక్షించాలి. బంగ్లాదేశ్‌లో దాడులకు గురవుతున్న హిందువులకు ప్రధాని మోదీ న్యాయం చేయాలి’’ అని అన్నారు.
బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిస్థితులు భారత్‌లో కూడా జరుగుతాయా? అని అడిగిన విలేకర్ల ప్రశ్నకు.. ‘‘ఏ దేశంలోనైనా ప్రజలే సుప్రీం. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల సహనాన్ని పరీక్షించకూడదు. అలా చేస్తే ప్రజా కోర్టు ఎలా తీర్పు ఇస్తుందో బంగ్లాదేశ్‌లో కనిపించింది. అన్నింటికంటే ప్రజాకోర్టే సర్వోన్నతమైంది. దేశ రాజధానిలో నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులను ఉగ్రవాదులు అన్నారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి అందరికీ ఒక హెచ్చరిక. తాము దేవుళ్లకు మించిన వాళ్లమని ఎవరూ అనుకోకూడదు. మమంతా మనుషులమే’’ అని మోదీపై విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment