బుల్లెట్ కు బ్రేకు
ముంబై: దేశంలో తొలిసారిగా అహ్మదాబాద్ నుంచి ముంబైకి ప్రయాణించే బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ముంబైలోని రద్దీ ప్రదేశంలో కుర్లా బాంద్రా కాంప్లెక్స్ (బీకేసీ) కింద అండర్ గ్రౌండ్ స్టేషన్ నిర్మాణనికి రైల్వేశాఖ ప్రతిపాందించింది. ఇందుకోసం జపాన్ కు చెందిన కంపెనీకి కాంట్రాక్టు కూడా అప్పగించింది.
బీకేసీలో స్టేషన్ నిర్మాణం వల్ల వ్యాపార వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యతరం తెలుపుతోంది. దీనివల్ల రూ.10,000 కోట్లు నష్టం జరుగుతుందని, అందుకే అక్కడ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వడానికి నిరాకరిస్తోందని సమాచారం.