సాక్షి, న్యూఢిల్లీ: భారత తొలి బుల్లెట్ రైలుకు గుర్తింపు తీసుకొచ్చేందుకు జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) ప్రయత్నాలు ప్రారంభించింది. 2022 నుంచి ముంబయి–అహ్మదాబాద్ మధ్య పరుగులు పెట్టే ఈ హైస్పీడ్ రైలుకు పేరును సూచించడంతో పాటు మస్కట్‌ను రూపొందిం చేందుకు దేశవ్యాప్తంగా పోటీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మస్కట్ ప్రభావవంతంగా ఉండటంతో పాటు ఎన్‌హెచ్‌ఎస్ ఆర్‌సీఎల్ విలువలను ప్రతిబింబించేలా ఉండాలని సూచించింది. అలాగే ప్రజలు బుల్లెట్ ట్రైన్‌తో మమేకమయ్యేలా పేరు ఉండాలని పేర్కొంది. విజేతలకు నగదు బహుమతి అందజేస్తామని, ఆసక్తి గల వ్యక్తులు మార్చి 25 నాటికి పేర్లను, మస్కట్ డిజైన్లను పంపించాలని తెలిపిం ది. మరిన్ని వివరాల కోసం mygot.in చూడాలని సూచించింది. 2017లో ఇలాం టి పోటీనే నిర్వహించి ఎన్‌హెచ్‌ఎస్ ఆర్‌సీఎల్ లోగో అయిన ‘చీతా’ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment