టోక్యో : భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బుల్లెట్ ట్రయిన్ సురక్షితం కాదనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు ఆధారం చేకూరేలా జపాన్ రాజధాని టోక్యోలని షింకాన్‌షెన్ బుల్లెట్ ట్రయిన్‌లో పొగలు, మంటలు వచ్చాయి. ఈ షింకాన్‌షెన్ బుల్లెట్ ట్రయిన్ సంస్థే.. భారత్‌లోనూ బుల్లెట్ ట్రయిన్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఆ సంస్థకు చెందిన రైలే భవిష్యత్‌లో భారత్‌లో పరుగులు తీయనుంది.
వివరాల్లోకి వెళితే...బుల్లెట్ ట్రయిన్ విభాగంలో అత్యంత శక్తివంతమైన షింకాన్‌షెన్ బుల్లెట్ ట్రయిన్ కు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. పట్టాలు బీటలు వారడంతో.. రైల్లో మంటలు, పొగలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో ప్రాణహాని లేకపోయినా.. బుల్లెట్ ట్రయిన్ వ్యవస్థలో ఇదో భారీ ప్రమాదంగా నిపుణులు చెబుతున్నారు. అత్యంత వేగంగా దూసుకుళ్లే ఈ రైలులో బుధవారం దక్షిణ జపాన్‌లోని నాగయ స్టేషన్ వద్ద పొగలు రావడం, అలాగే విచిత్రంగా వస్తున్న శబ్దాలు రావడాన్ని అధికారులు గుర్తించారు. ఆ వెంటనే రైలును పూర్తిగా నిలిపేశారు.
రైలును పూర్తిగా పరిశీలించిన అధికారులు చాసిస్ కింద ఆయిల్ లీక్ అవడం వల్ల పొగలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఈ ట్రయిన్ అలాగే మరికొంత దూరం ప్రయాణించి ఉంటే.. పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండేవని అధికారులు చెబుతున్నారు. రైల్లోని వెయ్యి మంది ప్రయాణికులును మరో బుల్లెట్ ట్రైన్‌లో తరలించారు. ఈ ఘటనపై షింకాన్‌షెన్ అధికారులు మాట్లాడుతూ.. ఇది అసాధారణ సమస్య అని చెప్పారు. దీని గురించి మేం సీరియస్‌గానే చర్చిస్తున్నట్లు వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment