చెన్నై బుల్లెట్‌ రైలుకు చైనా బ్రేక్‌ వేసిందా? | China Delays High-Speed Train Project For Chennai-Bengaluru: Report | Sakshi
Sakshi News home page

చెన్నై బుల్లెట్‌ రైలుకు చైనా బ్రేక్‌ వేసిందా?

Published Sun, Oct 15 2017 7:49 PM | Last Updated on Sun, Oct 15 2017 7:52 PM

China Delays High-Speed Train Project For Chennai-Bengaluru: Report

సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ భారతంలో తొలి బుల్లెట్‌ రైలు (హైస్పీడ్‌ రైలు) కల కలగానే ఉండిపోనుందా.. చెన్నై నుంచి బెంగళూరుకు హైస్పీడ్‌ రైలు మార్గం పనులు దాదాపు పడకేసినట్లేనా అంటూ ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం అవుననుకోక తప్పదేమో. ఎందుకంటే చైనా సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు భారత్‌ సిద్ధం కాగా.. గత ఏడాది కిందటే సర్వే పూర్తి చేసిన చైనా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదని అధికారులు చెబుతున్నారు. భారత్, చైనాకు మధ్య డోక్లామ్‌ వివాదం నెలకొన్ని నేపథ్యంలోనే చైనా ఈ ప్రాజెక్టు విషయంలో మిన్నకుండా పోయినట్లు సమాచారం.

చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య మొత్తం 492 కిలో మీటర్ల హైస్పీడ్‌ రైలు సర్వీసును ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ప్రాజెక్టు అధ్యయనం 2014లో ప్రారంభించగా 2016లో దానికి సంబంధించిన నివేదికను కూడా ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయం కూడా చైనానే భరించనున్నట్లు తెలిపింది. అయితే, పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన చైనా అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదంట. దీంతో ఈ ప్రాజెక్టుకు ముందుకు వెళుతుందో లేదో.. అసలు మొదలవుతుందో ఆగిపోతుందో తెలియడం లేదని అధికారులు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement