రాజధాని ఉద్యోగులకు 5 రోజులే పనిదినాలు | AP CM chandrababu speaks in Interim Secretariat inauguration | Sakshi
Sakshi News home page

రాజధాని ఉద్యోగులకు 5 రోజులే పనిదినాలు

Published Mon, Apr 25 2016 2:20 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

రాజధాని ఉద్యోగులకు 5 రోజులే పనిదినాలు - Sakshi

రాజధాని ఉద్యోగులకు 5 రోజులే పనిదినాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు లేవు, ఆదాయము లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం తెల్లవారుజామున ఏపీ  సచివాలయ భవన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం విడిపోవాలని మనం కోరుకోలేదని.. విభజన చేయాలంటే ఏపీకి న్యాయం చేయాలని చెప్పానన్నారు. రాజధాని అమరావతిలో పనిచేసే ఉద్యోగులకు వారంలో ఐదు రోజులే పనిదినాలు ఉంటాయని చెప్పారు.  ఉద్యోగులకు 30 శాతం హెచ్ ఆర్ ఏ ప్రకటించారు. ఉద్యోగులకు రాజధాని ప్రాంతంలో 5 వేల గృహాల సముదాయం నిర్మిస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.2,400 కోట్లు మంజూరు చేస్తూ ఫైలుపై సంతకం చేశారు. రుణ ఉపశమనంలో బ్యాలెన్స్ రూ. 178 కోట్ల విడుదల ఫైలుపై సంతకం చేశారు.

'అమరావతికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నా. రైతులు, రాజధాని ప్రాంత పేదలు బాగుండాలి. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు జూన్ 15 నాటికి పూర్తవుతాయి. నాపై నమ్మకముంచి 33,500 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రపంచంలో 10 ఉత్తమమైన రాజధానుల్లో మన రాజధానుంటుంది. సీఎం అయిన వెంటనే సింగపూర్ వెళ్లి రాజధాని మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని కోరాను. 6 నెలల్లో సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. జూన్లో మంచి రోజులు లేనందున ఇవాళే సచివాలయాన్ని ప్రారంభించాం. రెండో విడత రైతు రుణమాఫీపై సంతకం చేస్తున్నట్లు' చంద్రబాబు చెప్పారు.
 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement