
'భూమి పూజను అడ్డుకుంటాం'
గుంటూరు:
రైతులకు, రైతు కూలీలకు న్యాయం చేయకుండా జూన్ 6 న భూమి పూజ నిర్వహిస్తే అడ్డుకుంటామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో రైతాంగ సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 2న చంద్రబాబు నాయుడు చేపట్టే నవనిర్మాణ దీక్షను రైతు ద్రోహి దీక్షగా అభివర్ణించారు.