బాలానగర్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ | Minister KTR Inaugurating Balanagar Flyover Bridge | Sakshi
Sakshi News home page

బాలానగర్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Published Tue, Jul 6 2021 10:30 AM | Last Updated on Tue, Jul 6 2021 1:46 PM

Minister KTR Inaugurating Balanagar Flyover Bridge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాలానగర్‌ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. రూ.387 కోట్లతో 1.13 కి.మీ. పొడవుతో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. 6 లైన్లు, 24 మీ. వెడల్పు, 26 పిల్లర్లతో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవ క్యార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్‌ రద్దీ రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ప్రారంభంతో స్థానికులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి.

ఫ్లైఓవర్‌ ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, కూకట్‌పల్లి-సికింద్రాబాద్‌ మార్గంలో ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయన్నారు. త్వరలో రహదారుల విస్తరణ చేపడతామన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మిస్తామని తెలిపారు. ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌ను విస్తరిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు.

2017 ఆగస్టు 21న బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.387 కోట్లతో మూడున్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. బ్రిడ్జి ఇరువైపులా రెండు డివిజన్లు ఉన్నాయి. ఒకటి ఫతేనగర్, మరొకటి బాలానగర్‌. రెండు డివిజన్లతో వందలాది పరిశ్రమలు ఉన్నాయి. దీంతో నిత్యం కార్మికులు, లారీలు, ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది. బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు, 24 మీటర్లు వెడల్పు 26 పిల్లర్లతో నిర్మించారు. ఈ బ్రిడ్జికి ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్‌ నగరంలోని అతి ప్రధాన రహదారుల్లో ఒకటి, 6 లేన్లతో సిటీలోనే నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జి ఇది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement