రాజధాని నిర్మాణానికి సమయం కావాలి | Capital construction needs time says Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మాణానికి సమయం కావాలి

Published Fri, Mar 3 2017 2:47 AM | Last Updated on Tue, Aug 14 2018 2:31 PM

రాజధాని నిర్మాణానికి సమయం కావాలి - Sakshi

రాజధాని నిర్మాణానికి సమయం కావాలి

తాను అనుకున్న విధంగా రాజధాని నిర్మాణం చేయాలంటే సమయం, తగినన్ని వనరులు కావాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ప్రతి ఒక్కరిదీ ఒక్క రూపాయైనా భాగస్వామ్యం ఉండాలి
తాత్కాలిక అసెంబ్లీ భవన ప్రారంభోత్సవ సభలో చంద్రబాబు


సాక్షి, అమరావతి: తాను అనుకున్న విధంగా రాజధాని నిర్మాణం చేయాలంటే సమయం, తగినన్ని వనరులు కావాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక శాసనసభ, శాసనమండలి భవనాలకు చంద్రబాబు గురువారం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పొలంలో అయినా అసెంబ్లీ బ్రహ్మాండంగా ఉందన్నారు. రాజధాని నిర్మాణం అంటే ఒక్క ముఖ్యమంత్రి లేదా మంత్రులో చేసేది కాదని, ప్రతి ఒక్కరిదీ ఒక్క రూపాయైనా భాగస్వామ్యం ఉండాలని కోరారు.

 చంద్రబాబు తాత్కాలిక శాసనసభ, శాసనమండలి భవనాలను పరిశీలించారు. వారు అసెంబ్లీలో తమకు కేటాయించే కుర్చీల్లో కూర్చొని పరిశీలించారు. అసెంబ్లీ భవనాల్లో తమ చాంబరులో కూర్చొని కొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు. కాగా, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు గాను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వసతి ఏర్పాటుకు బదులుగా ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున అదనపు భత్యం చెల్లింపునకు సంబంధించిన ఫైలుపై చంద్రబాబు గురువారం సంతకం చేశారు.

ప్రజా గోడుకు పోలీసు ‘చాటు’
ప్రజలు తమ సమస్యలపై గొంతెత్తకుండా ప్రభుత్వం పోలీసులను ఉపయోగించడం రాష్ట్రంలో ఎక్కువైంది. శాసనసభ, మండలి భవనాల ప్రారంభోత్సవం అనంత రం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతు న్నప్పు డు సభికుల మధ్య కూర్చొన్న ఒక మహిళ లేచి తనకు జరి గిన అన్యాయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆమెకు అక్కడున్న పోలీసులు ఆ అవకాశం లేకుండా చేశారు. దీనితో ఆమె నిరాశకు గురయ్యారు. కాగా కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్‌ చక్రపాణితో పాటు ప్రభు త్వ సీఎస్‌ అజయ్‌ కల్లం, డీజీపీ ఎన్‌. సాంబశివరావు, పలు వురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement