సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు పొలిటికల్ గేమ్‌లో అమరావతిలోని పేదలకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధానిలో ఆర్-5 జోన్ నుంచి ఇళ్లు పొందిన పేదలను పంపేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు వేరే ప్రాంతాల్లో స్థలం ఇస్తామన్నారు.
కాగా, చంద్రబాబు పెత్తందారీ పాలనలో పేదలకు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. అమరావతి నుంచి పేదలు వెళ్లిపోవాలని చంద్రబాబు హుకుం జారీ చేశారు. రాజధానిలో ఆర్-5 జోన్ నుండి ఇళ్లు పొందిన పేదలను పంపేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. వారికి వేరే స్థలాలు ఇవ్వాలని సూచించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు.. ఆర్-5 జోన్‌లోని లబ్ధిదారులకు వాళ్ల ప్రాంతాల్లోనే స్థలాలు ఇస్తాం. లబ్ధిదారుల కోసం భూమిని సేకరించాలి. లేదంటే భూసేకరణ చేయాలి. లేకుంటే టిడ్కో ఇళ్లు అయినా ఇస్తాం అని చెప్పుకొచ్చారు. ఇక, అమరావతి భూములపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగానే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇక, ఇదే సమయంలో అమరావతి రోడ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతి రోడ్లన్నీ పీపీపీ మోడల్‌లో చేపట్టాలి. పీపీపీ పద్దతిలో రోడ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలి. ప్రైవేటుకు ఇస్తే రోడ్ల నిర్వహణ వారే చేస్తారు. గుంతలు ఏర్పడితే వారే పూడుస్తారు. అమరావతిలో ప్రత్యేకంగా పీపీపీ విభాగం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment