
భీమ్‌గల్: ఓ నిండుగర్భిణి పురిటినొప్పులతో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకుని వెళ్తుండగా దారి మధ్యలో చెరువుకట్ట తెగి నీటి ప్రవాహం పెరిగింది. జేసీబీ సహాయంతో ఆమెను నీటిప్రవాహంలోంచి దాటించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన నిండుగర్భిణి అనిలకు గురువారం పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరారు. మార్గమధ్యంలో పిప్రి నుంచి బాచన్‌పల్లి వెళ్లే దారిలో ఉన్న చెరువుకట్ట తెగిపోయింది. దీంతో ఆమెను జేసీబీలో కూర్చోబెట్టి దాని సహాయంతో నీటి ప్రవాహాన్ని దాటించారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్ ద్వారా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment