వార్నీ.. జేసీబీని ఇలా కూడా వాడొచ్చా! | Man Used JCB Excavator To Scratch His Back | Sakshi
Sakshi News home page

జేసీబీతో వీపు గోకించుకున్నాడు.. వీడియో వైరల్‌

Published Thu, Oct 15 2020 2:04 PM | Last Updated on Thu, Oct 15 2020 2:28 PM

Man Used JCB Excavator To Scratch His Back - Sakshi

జేసీబీని సాధారంగా చిన్నచిన్న ఇండ్లను కూల్చేందుకు లేదా మట్టిని తవ్వేందుకు వాడుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వీపును గోకేందుకు వాడుకున్నాడు. అవును మీరు చదివింది నిజమే. ఓ వ్యక్తి వీపును జేసీబీతో గోకించుకున్నాడు. ప్రస్తుతం నెట్టింట్లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 41సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో ఓ వ్యక్తి టవల్‌తో వీపును గోక్కుంటూ.. అక్కడనే ఉన్న జేసీబీ దగ్గరకు వెళ్లాడు. కిందకు వంగగా జేసీబీలో ఉన్న ఓ వ్యక్తి దానికి కిందకి దించి అతని వీపుపై పెట్టి కింది నుంచి పైకి వెళ్లే విధంగా చేశాడు.

ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు 2300 మంది షేర్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. నవ్వించేందుకే ఈ వీడియో తీశారని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడగా, అలా చేయడం ప్రమాదకరమని, మరోసారి ఇలా ఎవరూ చెయ్యెద్దని మరికొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో  ఉన్నవారు ఎక్కడివారు, ఎప్పుడు జరిగిందనే విషయాలు వెల్లడి కాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement